క్రైమ్ (Crime) జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

లోక్‌స‌భలో 10 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌ వేటు!!

పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాలు స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుంటున్న విషయం పాఠకులకు తెలిసిందే! పెగాస‌స్ అంశం, సాగు చ‌ట్టాల ర‌ద్దు లాంటి అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని పట్టు పడుతూ లోక్‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టడమే కాకుండా ఒకానొక ద‌శ‌లో కొంద‌రు విప‌క్ష ఎంపీలు చైర్‌పైకి పేప‌ర్లు విసిరేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా సీరియ‌స్‌గా స్పందిస్తూ ప‌ది మంది ఎంపీల‌పై వేటు వేశారు.

స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎంపీల్లో డీన్ కురియ‌కోజ్‌, హిబ్బి హిడ‌న్‌, జోయిమ‌ని, మానికం ఠాగూర్‌, ర‌వ‌నీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, ప్ర‌తాప‌న్‌, వైథిలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌లు ఉన్నారు. చైర్ ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు రూల్ 374(2) ప్ర‌కారం ప‌ది మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు, ఎవరైనా స‌భ్యులు భ‌విష్య‌త్తులో ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే, వారిని లోక్‌స‌భ ట‌ర్మ్ మొత్తం బ‌హిష్క‌రించ‌నున్న‌ట్లు స్పీక‌ర్ బిర్లా వార్నింగ్ ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •