క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

హుజూరాబాద్‌లో తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ!!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో అంబేద్కర్‌ కూడలి వద్ద తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్‌ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే కదా! ఇదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగగా తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.

ఈ క్రమంలో హుజూరాబాద్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఈటల జమున పాలాభిషేకం చేసిన సమయంలో తెరాస వర్గీయులు అక్కడకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగి ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్‌ ప్లెక్సీలు తగులబెట్టేందుకు భాజపా శ్రేణులు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాజపా కార్యకర్తలను అడ్డుకొని నిలువరించి తెరాస వర్గీయులను అక్కడ నుంచి పంపించినట్టుగా సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •