అంతర్జాతీయం (International) వార్తలు (News)

పెళ్లికి రానందుకు అతిథికి 17 వేల ఫైన్!!

ఇంట్లో జరిగే శుభకార్యాలకు అతిథులను పిలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక మనకు కావాల్సిన వాళ్లని తప్పకుండా రావాలని పిలిస్తే వారి మధ్య అనుబంధాన్ని బట్టి అతిథులు పిలిచిన కార్యాలకు హాజరుకావడం పరిపాటి! ఈ క్రమంలో కొందరు వీలు లేకనో లేదా అంత కంటే ముఖ్యమైన పని ఉన్న కారణంగానో కార్యానికి వెళ్లలేకపోవచ్చు. ఇది మామూలుగా జరిగే తతంగమే. కానీ ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి రానందుకు ఓ అతిథికి 17 వేల రూపాయల ఫైన్ వేసి ‍కట్టాలని పంపడంతో అతడు షాక్‌ అయ్యాడు.

ఇంతకీ సంగతి ఏంటంటే.. ఓ యువతి తన పెళ్లికి రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలవగా అతను తప్పక హాజరవుతానని, అందులోనూ జంటగా వస్తామని మాటివ్వడంతో ఇద్దరి కోసం ఆ పెళ్లి కూతురు రెండు సీట్లను రిజర్వ్ చేసింది. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాలర్ల చొప్పున 240 డాలర్లను ఖర్చు పెట్టింది. అయితే చివరకు వస్తానని చెప్పిన అతిథి ఆ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లకపోవడంతో కోపగించుకున్న ఆ పెళ్లి కూతురు ఆ వ్యక్తి రెండు సీట్లు రిజర్వ్‌ చేయడం కోసం అయిన ఖర్చు 240 డాలర్లు, మన కరెన్సీలో 17,700 రూపాయల బిల్లును రానందుకు పెనాల్టీగా అతడికి పంపించింది.

నువ్వు చెప్పినట్లు రిసెప్షన్‌కు రాకపోవడమే కాకుండా ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కనుక నీ కోసం రిజర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు నువ్వే చెల్లించాలి. జెల్లే లేదా పేపాల్‌ ఇలా ఏ పేమెంట్ ద్వారా అయినా చెల్లించు అంటూ ఇన్‌వాయిస్‌తో పాటు ఆ నవ వధువు ఒక నోట్‌ను కూడా పంపించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    12
    Shares
  • 12
  •  
  •  
  •  
  •