జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఉక్కు ఉద్యమానికి 200 రోజులు!!

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకున్న సందర్భంగా కార్మిక సంఘాలు భారీ మానవహారాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలో అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో గాజువాక వద్ద తెదేపా మాజీ ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కి.మీ మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, ర్యాలీ నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •