టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఇక మెట్రో రైళ్లల్లో సైకిళ్లు .. ఎక్కడ??

పుణె మెట్రో ప్రాజెక్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకుని రైళ్లల్లో సైకిళ్లను తీసుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పుణె మెట్రో ప్రాజెక్టును అమలు చేస్తున్న మహా-మెట్రో, సంత్ తుకారామ్ నగర్, ఫుగేవాడి స్టేషన్ల మధ్య మెట్రో రైలులో సైకిళ్లతో గురువారం ట్రయల్ రన్ నిర్వహించింది. పుణే మెట్రోలో ప్రయాణించేవారు ఇకపై తమ వెంట సైకిళ్లను కూడా తీసుకువెళ్లవచ్చని, దీంతో మెట్రో రైలులో ప్రయాణించిన తరువాత ఆటోలు, బస్సుల కోసం వేచిచూడాల్సిన అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎంతోమందికి మేలు చేకూరుస్తుందని, సైకిళ్ల కారణంగా పర్యావరణానికి హాని జరగకపోవడమే గాక రోడ్లపై ట్రాఫిక్‌ కూడా తగ్గుతుందని వెల్లడించారు.

సాధారణంగా ప్రజలు మెట్రో స్టేషన్‌కు రావాలన్నా, ఇక్కడి నుంచి వేరేచోటికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తారు. దీని కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌ పెరగడంతో పాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అలాంటి వారు తమ వెంట సైకిల్‌ తెచ్చుకుంటే మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలన్నా, రైలు దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నా సైకిళ్లు ఎంతో దోహద పడతాయని బ్రిజేష్‌ దీక్షిత్‌ అభిప్రాయపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    15
    Shares
  • 15
  •  
  •  
  •  
  •