టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

స్టీల్ బాక్స్ తెచ్చుకోండి.. చికెన్ పై తగ్గింపు పొందండి!!

చికెన్, మటన్, చేపలు, గుడ్లు కావాలంటే షాపుకు అలాగే వట్టి చేతులతో వెళ్తాము. షాపు వాళ్లు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇస్తే తెచ్చేసుకుంటాం. ఓ చికెన్ షాపు యజమాని మాత్రం వట్టి చేతులతో కాదు కూడా స్టీల్ బాక్సు తెచ్చుకోండి అని తన కస్టమర్ లకు చెబుతున్నాడు. స్టీల్ బాక్స్ తెచ్చుకుంటూ రూ.10లు డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నాడు సుధాకర్ చికెన్ మార్కెట్ యజమాని. దీనికోసం బ్యానర్ ఏర్పాటు చేసాడు.

ఆ ప్రకటన బోర్డుని షేర్ చేస్తూ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలనీ అందరూ కోరుతున్నారు. ఇది చాలా మంచి ఆలోచన అంటూ, మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నామని నెటిజన్లు తెలిపారు. వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి చేటు చేస్తోంది. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన నాలాలు మసుకుపోతున్నాయి. భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతున్నాయి. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల్లోని పదార్ధాలను తిని ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో తరచుగా వింటూనే ఉన్నాం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •