వార్తలు (News) వినోదం

ఊటీ లో అందాలను వర్ణించతరమా??

చెవుల మీదకు వేళ్లాడే జడలు, హాఫ్‌వైట్‌ లుంగీ, ఎరుపు-నలుపు కలగలిసిన చక్కటి నేత ఓణీ. సంప్రదాయ చేనేత ఓణీలోని నేత సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ వస్త్రధారణ.

సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చేత్తో చిటికెలు వేస్తూ ఉత్సాహభరితంగా సాగే ఈ డాన్స్‌ పేరు టోడా ట్రైబల్‌ డాన్స్‌. టోడా ఆదివాసీల సంప్రదాయ నృత్యం. ఈ డాన్సుతోపాటు నీలగిరుల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఊటీబాట పట్టాల్సిందే. ఈ నృత్యం చేస్తున్న వాళ్లు టోడా ఆదివాసీ మహిళలు. ఆదిమ కాలం నుంచి నీలగిరుల్లో నివాసం ఉన్నది వీళ్లే. ఊటీ ట్రిప్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. టీ తోటల మధ్య మలుపులు తిరుగుతూ సాగే రోడ్డు ప్రయాణమే గొప్ప ఆనందం. ఇక్కడ పర్యటించేటప్పుడు కారు అద్దాలను దించుకుని, మాస్కు తీసిసి హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు.

ఊటీ టూర్‌లో ఎత్తైన పీక్‌ దొడబెట్ట, బొటానికల్‌ గార్డెన్, టీ గార్డెన్‌ల విహారం ఎప్పుడూ ఉండేవే. ఈ సారి వాటన్నింటితోపాటు టోడా ట్రైబల్‌ విలేజ్, రోజ్‌ గార్డెన్, కూనూర్‌తోపాటు దేశంలోని వివిధ నిర్మాణశైలులను ప్రతిబింబించే ప్యాలెస్‌ కూడా చూడండి!

నీలగిరులు ఊటీగా మార్పు చెందే క్రమంలో వెలసిన నిర్మాణాలివి.
మైసూర్‌ మహారాజు నిర్మించుకున్న ఫెర్న్‌ హిల్‌ ప్యాలెస్‌
జోద్‌పూర్‌ మహారాజు ఆరన్మోర్‌ ప్యాలెస్‌
జామ్‌నగర్‌ నవాబు నవానగర్‌ ప్యాలెస్‌ ఇందోర్, పోర్‌బందర్, కొచ్చిన్, ట్రావెన్‌కోర్‌ రాజవంశీకులు నిర్మించుకున్న వేసవి విడిదులు, వెస్ట్రన్‌ స్టైల్‌ చర్చ్‌లు కూడా ఉన్నాయిక్కడ. ఊటీలో మంచి హోటళ్లున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, కాంటినెంటల్‌ రుచులు కూడా దొరుకుతాయి. ఈ టూర్‌లో ఊటీ స్పెషల్‌ టీ తాగడం మర్చిపోకూడదు.

ఊటీ టూర్‌ అనగానే మొదటగా టాయ్‌ట్రైన్‌ గుర్తుకు వస్తుంది. ఆవిరితో నడిచే ఈ రైలు ప్రయాణాన్ని కూనూర్‌ వరకు కొనసాగించవచ్చు. మనకు ఎనభైల నాటి సినిమాల్లో ఊటీ లొకేషన్‌లుగా కనిపించే అనేక ప్రాంతాలు కూనూర్‌లోనివే. తెలుగు సినిమాలో కాదు. బాలీవుడ్‌ సినిమాలకు కూడా ఇది మంచి లొకేషన్ గా చెప్పుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •