వార్తలు (News) వినోదం

ఇండియన్‌ ఐడల్‌ గాయకులతో సంగీత కార్యక్రమం!!

ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ గాయనీ గాయకులు భాగ్యనగర సంగీత ప్రియులను తమ గాన మధుర్యంతో ఉర్రూతలూగించడానికి ‘రివైవ్‌ కన్సర్ట్‌ సిరీస్‌’ పేరుతో ఎలెవన్‌ పాయింట్‌ టు, మెటలాయిడ్‌ ప్రొడక్షన్స్‌ ఈవెంట్ ఆర్గనైజింగ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక సంగీత కచేరీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్‌ ఐడల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండో రన్నరప్ శైలి, మూడో రన్నరప్ మొహమ్మద్ డానిష్‌తో పాటు షణ్ముఖ ప్రియ పాల్గొన్నారు. సెప్టెంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మెటలాయిడ్‌ ప్రొడక్షన్స్‌ ప్రతినిధి ప్రీతిష్‌ కోలాటి అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    28
    Shares
  • 28
  •  
  •  
  •  
  •