క్రైమ్ (Crime) వార్తలు (News)

క్యారీ బ్యాగ్‌లకు డబ్బులు వసూలు చేసినందుకు ఫైన్??

నేటి రోజుల్లో D-Mart, అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. మేజర్ రిటైలర్ గా D-Mart కు పేరు ఉంది. అయితే తాజాగా D-Mart, Paradiseలకు జిల్లా వినియోగదారుల ఫోరం చట్ట వ్యతిరేకంగా క్యారీ బ్యాగ్ లకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఫైన్ విధించింది. రెండు సంస్థలు క్యారీ బ్యాగ్ లకోసం డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుడు కంప్లయింట్ చేయడంతో ఫిర్యాదుపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ కన్ జ్యూమర్స్ ఫోరం వినియోగదారుల సంక్షేమ శాఖకు రూ.50వేలు జరిమానా చెల్లించాలని సంస్థలను ఆదేశించింది.

యాంటీ కరప్షన్ ఫోరం ఛైర్మన్ విజయ్ గోపాల్ 2019 జులై 1వ తేదీన ప్రొసీడింగ్స్ ఫైల్ చేశారు. అందులో డీ మార్ట్ 3.5 రూపాయలు, పారడైజ్ 4.76 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పేర్కొనగా ఇదంతా Siasat.com లో ప్రచురితమైంది. చట్ట వ్యతిరేకంగా వసూలు చేస్తున్నందుకు ఇరు సంస్థలకు ఈ ఏడాది ఆగస్ట్ 11న జరిమానా విధించారు. ఈ రెండు సంస్థలు కలిసి కన్జూమర్ వెల్ఫేర్ ఫండ్ కు రూ.50వేలు జరిమానా డిపాజిట్ చేయాలని, 2016, 2018 ప్లాస్టిక్ వేస్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనీ, ఈ రెండు అవుట్ లెట్లు క్యారీ బ్యాగ్స్ కు డబ్బు వసూలు చేయడం ఆపేయాలని ఆదేశించారు. కస్టమర్లందరికీ అలాగే ఉచితంగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ జరిపి రూ.3వేల రూపాయలు గోపాల్ కు ఇవ్వాలని, లీగల్ ఖర్చులకు పెట్టిన వెయ్యి రూపాయలు కూడా అందజేయాలని ఫోరం సూచించింది. 40రోజుల్లోగా చెల్లించకపోతే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్లు అవుతుందని హెచ్చరించినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •