ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే..??

చర్మం పొడిబారడం వల్ల కావచ్చు,వృద్ధాప్యం వల్ల కావచ్చు మీ ముఖం సహజ మెరుపును కోల్పోయే అవకాశం ఉంది. మీ వర్చస్సు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళి మునుపటిలా మెరిసిపోవడానికి మీ ఇంట్లోనే మీరు పాటించదగిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. తక్కువ రోజులలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆ పద్దతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

శనగ పిండి, పసుపు – ఇది చర్మం నుంచి టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. రెండు చెంచాల శనగ పిండిని తీసుకోని దానికి చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, పాలు కలపండి. చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

నిమ్మ- తేనె ప్యాక్- ఒక నిమ్మకాయ రాసానికి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ పొడి చర్మం ఉన్నవారు వాడకపోవడమే మంచిది. దాని స్థానంలో మిగల మాగిన అరటి పండును కూడా తీసుకోవచ్చు.

కొబ్బరి పాలు- కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి, తేలికపాటి ఆమ్లాలు డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలలో కాటన్ బాల్‌ను ముంచి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత కడగండి.

టమోటాలు – టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. టమోటా రసాన్ని తీసుకొని చర్మంలోని టాన్ ఉన్న ప్రదేశాలకు అప్లై చేయండి. 15 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.

తేనె-బొప్పాయి ప్యాక్- బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. కొద్దిగా బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ముఖం ఇతర చర్మంపై పూయండి. ఆరిన తర్వాత కడగండి. మంచి నిగారింపు ఉంటుంది.

ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ఎండ ఎక్కువగా ఉన్న సమయాలలో బైటకు వెళ్లడం మానుకోండి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •