జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

NHM AP ప్రభుత్వ విభాగంలో జాబ్ నోటిఫికేషన్!!

నేషనల్‌ హెల్త్ మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో 70 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్‌ హబ్స్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

https://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడండి. సెప్టెంబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలలో 14 పీడియాట్రీషియన్‌ ఉద్యోగ ఖాళీలు, 14 గైనకాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలు, 14 జనరల్ ఫిజీషియన్ ఉద్యోగ ఖాళీలు, 28 మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయలు, ఇతర ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 53,300 రూపాయలు చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. [email protected] ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •