రాజకీయం (Politics) వార్తలు (News)

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన స్టాలిన్!!

బీజేపీ సర్కార్‌ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే కదా! ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి బీజేపీ సర్కార్‌ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించగా తమిళనాడు సర్కార్‌ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది

తమిళనాడు సిఎం స్టాలిన్ శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం స్టాలిన్ వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడడంతో బిజెపి పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ వాకౌట్ చేసి ధర్నాకు దిగారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    6
    Shares
  • 6
  •  
  •  
  •  
  •