జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇక నుంచి చౌకగా ఏసీ కోచ్‌లో ప్రయాణం !!

ఇండియన్‌ రైల్వే సెప్టెంబర్‌లో స్పెషల్‌ ఎకానమీ AC 3-టైర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఇందులో ధరలు AC 3-టైర్ కంటే 8 శాతం తక్కువగా నిర్ణయించారు. ఈ స్పెషల్‌ కోచ్‌లు స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం ఉద్దేశించినవి కాబట్టి సాధారణ AC 3-టైర్ ఛార్జీ కంటే తక్కువగా ఉండాలి అలాగే స్లీపర్ క్లాస్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే 300 కి.మీ వరకు బేస్ ఛార్జీ రూ.440 ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది దూరం పరంగా అతి తక్కువ. అయితే అత్యధిక బేస్ ఛార్జీ 4,951 నుంచి 5,000 కిమీలకు రూ.3,065 ఉండనున్నట్లు సమాచారం. ప్రయాగరాజ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మొదటి ఎకానమీ ఏసీ త్రీటైర్ కోచ్ స్పెషల్ అమర్చారని తెలిపారు.

రైల్వే ప్రణాళిక ప్రకారం ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దాదాపు 806 కొత్త కోచ్‌లను సిద్ధం చేయాలని రైల్వే భావిస్తోంది. వీటిలో ఉత్తమ AC ప్రయాణాన్ని అత్యంత సరసమైన ధరలలో అందిస్తారు. 2021 లేదా 2022 చివరి నాటికి మనకు 806 AC 3-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కోచ్‌ల తయారీకి రైల్వే ఫ్యాక్టరీలన్నీ కలిసి పనిచేస్తాయని గతంలో రైల్వే అధికారులు చెప్పారు. ఇండియన్‌ రైల్వే ప్రయాణికులందరికి మునుపెన్నడూ లేని అనుభవాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంది.

కానీ AC, ఛార్జీలు ఈ కోచ్‌లలో మెరుగైన డిజైన్, ప్రతి బెర్త్ కోసం స్పెషల్‌ AC వెంట్‌, సీట్ల మాడ్యులర్ డిజైన్, వ్యక్తిగత రీడింగ్ పాయింట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మరిన్ని వాటిని అమర్చుతున్నారు. అంతేకాదు రెగ్యులర్ AC కోచ్‌లతో పోలిస్తే కొత్తగా డిజైన్ చేసిన కోచ్‌లలో బెర్తుల సంఖ్య 15 శాతం పెరిగింది. మరి భవిష్యత్తులో వీటిని ప్రయాణికులు ఎంతగా ఆదరిస్తారో చూడాలి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    21
    Shares
  • 21
  •  
  •  
  •  
  •