క్రైమ్ (Crime) వార్తలు (News)

మొబైల్ యాప్‌ సహాయంతో క్రికెట్ బెట్టింగ్ !!

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో టెక్నాలజీని వాడుతూ కోట్ల రూపాయల బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్న బుకీలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌ దేవ్‌ పల్లితో పాటు ఏడు చోట్ల ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి ఈ దాడుల్లో 23 మంది బుకీలను అరెస్టు చేయడంతో పాటు రూ.93 లక్షలు సీజ్‌ చేశామన్నారు. అలాగే వారి వద్ద నుండి 247 మొబైల్స్, నాలుగు కార్లతో కలిసి మొత్తం రూ.2.2 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గూగుల్‌ ప్లే స్టోర్ లో ఉన్న మొబైల్ యాప్‌ తో ఈ ముఠా బెట్టింట్‌కు పాల్పడుతోందని, బెట్టింగ్‌ ను నాలుగు లేయర్స్‌ లో నిర్వహిస్తున్నారని, మెయిన్ బుకీకి అనుసంధానంగా మరో ముగ్గురు పని చేస్తున్నారని, వారి సహాయంతో మొబైల్ యాప్స్ నుంచి సమాచారం తీసుకుని బెట్టింగ్ జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈ బెట్టింగ్ ముఠాకు ముంబై, గోవా, దుబాయ్‌ లలో నెట్‌ వర్క్ ఉన్నట్లు గుర్తించామని, విజయవాడకు చెందిన మహా అనే వ్యక్తి మెయిన్ బుకీగా ఉన్నాడని, బెట్టింగ్ నిర్వహిస్తున్న యాప్స్‌ ను తొలగించాలని గూగుల్‌ కు లేఖ రాస్తామని సీపీ వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని సీపీ హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •