ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల??

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదలచేయగా దానిలో మూడు పార్లమెంట్‌, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్‌, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉండగా హుజురాబాద్‌, బద్వేలులో అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలోని బద్వేలులో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడగా ఈసీ అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది.

ముఖ్యమైన తేదీలు:

ఎన్నికల నోటిఫికేషన్‌: అక్టోబర్‌ 1
నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్‌ 8
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 11
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్‌ 13
ఎన్నికల పోలింగ్‌: అక్టోబర్‌ 30
ఓట్ల లెక్కింపు: నవంబర్‌ 2

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •