జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీపీఎస్సీ ఆయుష్‌ విభాగంలో 151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 151

పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్లు(ఆయుర్వేద-72, హోమియోపతి-53, యునానీ-26).
అర్హతలు: ఆయుర్వేద/హోమియోపతి/యునానీ లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో శాశ్వత మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా నమోదు చేసుకొని ఉండాలి. వయసు: 01.07.2021 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు : నెలకు రూ.37,100-రూ.91,450 మధ్య ఉంటాయి. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ముఖ్య వివరాలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
వెబ్‌సైట్‌: http://www.psc.ap.gov.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •