భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు. కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్‌ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) చివరి 52 బంతులు కాచుకుని కివీస్ ను గట్టెక్కించారు. చివరి సెషన్ లో 5 వికెట్లు పడగొట్టి భారత్ కు దాదాపు విజయం ఖాయం అనుకున్న తరుణంలో చివరి వికెట్ కు కివీస్ పోరాటం అద్భుతంగా సాగింది. ఓపెనర్ టామ్‌ లేథమ్‌ (52: 146 బంతుల్లో 3 ఫోర్లు), సోమర్‌ విల్లే (36: 110 బంతుల్లో 5 ఫోర్లు), కేన్‌ విలియమ్సన్‌ (24: 112 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్లు పడకుండా కాచుకోవడంతో దాదాపు డ్రా అనుకున్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, అక్షర్‌ పటేల్‌, ఉమేశ్ యాదవ్‌ తలో ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ కు లభించింది.