ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్యకార్యదర్శులు సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.