ఏపీలో రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖ లో 60 పోస్టులు భర్తీ చేయనుండగా ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.