దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు ఊగిసలాటల మధ్య ట్రేడింగ్ ను నిర్వహిస్తున్నాయి. ప్రారంభంలో స్వల్ప లాభాల నష్టాల మధ్య ప్రారంభమైన ట్రేడింగ్ కాసేపటికే లాభాల్లోకి పాకి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 57,965 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17,254 వద్ద ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.