సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సీబీఐసీ లాంటి కేంద్ర సంస్థల్లో సబ్ఇన్​స్పెక్టర్స్ సహా వివిధ విభాగాల్లో గ్రూప్’-బి’, గ్రూప్-‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్‌(సీజీఎల్)-2021 నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్‌-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే.

సెంట్రల్ కొలువుల్లో ప్రధానమైన పోస్టులు ఉండే సీజీఎల్ లో నాలుగు అంచెల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉండడంతో పాటు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ రిక్రూట్​మెంట్ కు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ మహిళలకు ఫీజు లేదు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గా 25 జనవరి 2022
నిర్ణయించారు. పరీక్షా కేంద్రాలుగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

టయర్‌-1 ఎగ్జామ్ ఏప్రిల్‌, 2022 లో ఉంటుంది. టయర్‌-2 ఎగ్జామ్ పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది. అప్లై చేసుకోవడానికి http://www.ssc.nic.in వెబ్​సైట్ లో చూడండి.

పోస్టులు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌/ సూపరింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్‌), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్‌), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్‌, డివిజనల్ అకౌంట్స్‌, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/ జూనియర్ అకౌంటెంట్‌, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్‌, అప్పర్ డివిజన్ క్లర్క్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌.

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60% ఉత్తీర్ణతతో డిగ్రీ పూర్తిచేసి, 10+2లో మ్యాథ్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులుగా నిర్ణయించారు. పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్: క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, ఫజిల్, మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్, వెన్ డయగ్రామ్, డైరెక్షన్ & డిస్టాన్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, వెర్బల్ రీజనింగ్, నాన్​ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ & సోషల్ ఇంటెలిజెన్స్.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సెంటేజ్, రేషియో & ప్రపోర్షన్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, టైం & వర్క్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ.

జనరల్ అవేర్​నెస్​: స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ (ఇండియన్ హిస్టరీ, కల్చర్ తదితర), సైన్స్, కరెంట్ ఎఫైర్స్, స్పోర్ట్స్, బుక్స్ & ఆథర్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పోర్ట్​ఫోలియోస్, పీపుల్ ఇన్ న్యూస్, కంప్యూటర్స్, అవార్డులు, జాగ్రఫీ, ఎకానమి, పాలిటీ, పాపులేషన్ సెన్సెస్

ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ప్రేజస్ & ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్​స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎరర్ స్పాటింగ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ & ప్రెజెస్.

టయర్1: టయర్ 1 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఎగ్జామ్ డ్యురేషన్ 60 నిమిషాలు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.

టయర్ 2: టయర్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థికి టైర్ 2 ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో ప్రతి సబ్జెక్టుకు 200 మార్కులు ఉంటాయి. రెండు గంటల టైం ఉంటుంది. టైర్ 2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగంలో ప్రతి తప్పు సమాధానానికి పావుమార్కు, మిగతా విభాగాల్లో ప్రతి తప్పు ఆన్సర్​కు అర మార్కు తగ్గిస్తారు.

టయర్ 3: టయర్ 3 పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ పేపర్. అభ్యర్థులు గంట టైంలో ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో ఎస్సేలు/ లెటర్/ అప్లికేషన్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ ఎగ్జామ్.

టయర్ 4: మూడు దశల్లో ప్రతిభ చూపించి టైర్ 4కు ఎంపికైన అభ్యర్థులకు టయర్ 4లో పోస్టును బట్టి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్​ వెరిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్​లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎస్ఎఫ్ఐవో పోస్టులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులో వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ & ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డేటా ఎంట్రీ స్పీడ్ గంటకు 8 వేల కీ డిప్రెషన్ ఉండి తీరాలి.