ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం మీదుగా కోస్తా పైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో దట్టంగా మంచు కురిసింది. ఉదయం పది గంటల వరకు మంచు ఏర్పడటం కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో తూర్పుగాలులు మరింత బలపడే అవకాశముండటంతో ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.