ఒమీక్రాన్ విజృంభిస్తున్నవేళ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేస్తూ 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అలాగే ఐదుగురు కంటే ఎక్కువ మందికి గుమిగూడకూడదని, మాస్క్ ను తప్పనిసరిగా పాటించాలని, కరోనా నిబంధనలను అమలు చేయాలనీ ప్రభుత్వం సూచనలు చేసింది.

వివాహ వేడుకల్లో కేవలం 100 మంది మాత్రమే హాజరు కావాలని, 50% సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లకు అనుమతులు ఇచ్చింది. ఇక అటు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం షిరిడీలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరం మూసి వేస్తున్నట్లు సంస్థాన్ వెల్లడించింది. ఆలయం లోని అన్ని సౌకర్యాలు కూడా మూసివేస్తామని భక్తులు దీనిని దృష్టి లో ఉంచుకోవాలని షిర్డీ సంస్థాన్ సూచించింది.