నేడు ఒడిదుడుకుల మధ్య మొదలైన మార్కెట్ సూచీలు కాసేపటికే లాభాల్లోకి జారుకుని మళ్ళీ నష్టాల్లోకి మునిగాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,892.31 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై తరువాత 58,097.07 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 90.99 పాయింట్ల నష్టంతో 57,806.49 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,220.10 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,285.95-17,176.65 మధ్య కదలాడి చివరకు 19.65 పాయింట్లు నష్టపోయి 17,213.60 వద్ద స్థిరపడింది.

సూచీలో సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంకు, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ముగిసాయి. ఎస్ బి ఐ, టెక్ మహీంద్రా, ఎన్ టీ పి సి, ఐ టి సి , టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.