దేశ రాజ‌ధానిలో రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌కు చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని, వారితో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ సిద్ధంగానే ఉంద‌ని పేర్కొన్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న ఇవాళ అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ… రైతుల‌కు హామీ ఇచ్చిన‌ట్లుగా కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కొంత‌కాలం పాటు నిలిపి వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు.

రైతుల అభ్యంత‌రాలు వినేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామ‌న్నారు. రైతుల సంక్షేమం, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై త‌మ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. బ‌డ్జెట్‌లోనూ రైతుల‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌ను విప‌క్షాలు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, తాము అన్ని అంశాల‌పై చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు మోడీ స్ప‌ష్టం చేశారు.