వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్ కొవిడ్‌ వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,851 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 993 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 198, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,213కి చేరింది. 480 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,86,978కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,50,52,215 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,00,805 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.