క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతుండడంతో వృద్దులు ఆందోళనతో వణికిపోతున్నారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి చేస్తున్న విల‌య‌తాండ‌వం ఒక పక్క, భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతుండడం మరొకపక్క మనుషులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల‌ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకుని తన ప్రాణం తీసుకున్నారు. నాగ్‌పూర్‌ ఆస్ప‌త్రి వైద్యులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.