కృష్ణా జిల్లాలో 65వ నంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. వత్సవాయి మండలం భీమవరం సమీపంలోకి రాగానే అదుపుతప్పిన బైకు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై ముందు కూర్చొని ఉన్న కుమార్తె, తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతి చెందిన వ్యక్తి భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రలును జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.