వార్తలు (News)

నాగపూర్ ఆస్పత్రుల్లో బెడ్ ల కొరత …

మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ విపరీతంగా ఉందని పాఠకులకు తెలిసిన విషయమే! అయితే కొవిడ్‌ ఉద్ధృతితో నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పడకలు చాలక ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగ్‌పూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి(జీఎంసీహెచ్‌)లో కొవిడ్‌ వార్డు రోగులతో నిండిపోయింది. ఇక్కడి ప్రతి బెడ్డుపై కనీసం ఇద్దరు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సమస్య తీరిందని, రోగుల రద్దీతో ఆసుపత్రిలో పడకలను పెంచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ అవినాశ్‌ గవాండే చెప్పారు. ప్రస్తుతం ఒక బెడ్‌పై ఒకే రోగిని ఉంచినట్లు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.