ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన శ్యామల ఆనిమేషన్ రంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. కానీ ఆనిమేషన్ రంగంలో నష్టాలు రావడంతో వచ్చిన డిప్రెషన్ ను ఎదుర్కొనే క్రమంలో స్విమ్మింగ్ ను ప్రారంభించి రోజు రోజుకి క్రమంగా దానిని ప్రేమించడం మొదలుపెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అన్నిటిని దిగమింగి జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలో కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత శ్రీలంక, భారత్ మధ్యనున్న పాక్ జలసంధిలో ఈదాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. నీ వయసువారికి అది సాధ్యం కాదు అని ఎంతమంది ఎన్ని రకాలుగా వెనక్కు లాగినా తాను నమ్మినదానిపై విశ్వాసం ఉంచి చివరకు రికార్డు సృష్టించారు. 47ఏళ్ల వయసులో భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిలో 30 కి.మీ. దూరాన్ని దాదాపు 14 గంటల్లో ఈదుకుంటూ దాటి రికార్డు సృష్టించారు. వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని పట్టుదలతో నిరూపించారు.