అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు మంగళవారంపెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్వల్పంగా తగ్గించడం సంతోషించదగ్గ పరిణామం. దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 19-22 పైసలు, డీజిల్‌పై 21-23 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి. ఆరు రోజుల వ్యవధిలో దేశంలో ఇంధన ధరలు తగ్గించడం ఇది రెండోసారి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 కాగా, డీజిల్‌ ధర రూ.88.20కి చేరింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.96.98, డీజిల్‌ ధర రూ.87.96 నమోదు కాగా.. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.66, డీజిల్‌ ధర రూ.85.96కు తగ్గాయి. కోవిద్ లో లొక్డౌన్ దిశగా కొన్ని దేశాలు నిర్ణయించుకోవడం, సూయిజ్‌ కాలువలో నిలిచిపోయిన ఓడ సోమవారం తిరిగి కదలడంతో ముడిచమురు ధరలు 1శాతం తగ్గడమూ తదితరాలు దీనికి కారణంగా చెప్పుకుంటున్నాయి.