చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసు ఎంత సంచలనం సృష్టించిందో పాఠకులకు అందరికి తెలిసిందే! ఆధ్మాత్మిక లోకంలో మునిగిపోయి మూఢ భక్తితో కన్న కూతుళ్లనే చంపుకొన్న నిందితుల మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తొలుత వారిని జైలు నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు నిందితులకు కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించడంతో దీంతో ఆ సదుపాయం ఉన్న విశాఖ మానసిక చికిత్సాలయానికి నిందితులిద్దరినీ తరలించి చికిత్స అందించారు. వారు కోలుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించడంతో ఈ ఉదయం తిరిగి మదనపల్లె సబ్‌జైలుకు తీసుకొచ్చారు.
గట్టి పోలీస్‌ బందోబస్తు మధ్య వీరిని స్థానిక సబ్‌జైలులో ఉంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దంపతులు పురుషోత్తం నాయుడు, పద్మజలను అరెస్టు చేసిన పోలీసులు నిందితులను మదనపల్లె సబ్‌జైలుకి తరలించారు.