రియల్ వరల్డ్ అనే సంస్థ కరోనా వైరస్‌కు సంబంధించి ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయనే దానిపై పరిశోధనలు జరిపి ఒక నివేదిక తయారుచేసింది. ఈ టీకాలు మొదటి డోసుకే కొవిడ్ ముప్పును 80 శాతం దూరం చేస్తాయని, అమెరికాలో అనుమతి పొందిన వ్యాక్సిన్ల రక్షణ సామర్థ్యం మీద టీకా తీసుకున్న దాదాపు 4వేల మందిపై పరిశోధన నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని రియల్ వరల్డ్ బహిర్గతం చేసింది.
తొలిడోసు మాత్రమే తీసుకున్న వారిలో 80శాతం మేర ముప్పును తగ్గిస్తున్నాయి. ఇక రెండు డోసులు తీసుకున్న వారిలో 90శాతం వైరస్ ముప్పును నివారిస్తున్నాయి’ వీరి పరిశోధన లో తేలింది. ఈ అధ్యయనంలో ఆరు రాష్ట్రాలకు చెందిన టీకా తీసుకున్న 3950 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 13 వారాల పాటు పాల్గొన్నారు. ఈ తాజా పరిశోధన నివేదికల ద్వారా తమ వ్యాక్సినేషన్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నిరూపితమవుతోందని అభిప్రాయపడ్డారు.