ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

టీకా తీసుకున్నవారు చేసే తప్పులు ఏంటి?

కరోనా టీకా కూడా నిజం వైరస్ లాగానే రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల జ్వరం, కండరాల నొప్పులు, టీకా తీసుకున్న చోట నొప్పి వంటివి తలెత్తుతాయి. అవన్నీ టీకా ప్రభావానికి సంబందించిన సంకేతాలు! కానీ కొందరు ముందే నొప్పులు వస్తాయేమో అని ఐబుప్రోఫెన్ వంటి మందులు వేసుకుంటున్నారు కానీ దీనివల్ల రోగనిరోధక ప్రతిస్పందన తగ్గి యాంటీబాడీలు ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

నిజానికి మరీ అవసరమైతే తప్ప నొప్పి మందుల అవసరం లేదు. తప్పదు అనిపించినప్పుడు మాత్రం 6 గంటలకు ఒకసారి పారాసిట్మాల్ 650 మి. గ్రా మోతాదులో వాడుకోవచ్చు. ఒకవేళ ఇతర జబ్బుల వల్ల ఏదయినా మందులు వేసుకుంటుంటే డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవచ్చు.

టీకా వేయించుకున్నాక నొప్పి, జ్వరం తగ్గడానికి మందుల స్థానంలో చిట్కాలు పాటించడం మంచిది. టీకా వేసిన చోట నొప్పి ఉంటె తరచుగా చల్లటి, తడి బట్టతో అడ్డుకుంటూ…జ్వరం వస్తే ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉండడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.