వార్తలు (News)

భారత్ లో 44,230 కొత్త కేసులు.. 555 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,16,277 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 44,230 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.15 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 555 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మృతుల సంఖ్య 4,23,217 కు చేరింది. ప్రస్తుతం 4,05,155మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో ప్రస్తుతం క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉండగా.. నిన్న ఒక్కరోజే 42,360 మంది కోలుకోగా మొత్తం ఇప్పటివరకు 3.07 కోట్ల మంది వైరస్‌ను జయించడంతో రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •