క్రైమ్ (Crime) వార్తలు (News)

ఎట్టకేలకు ఐదేళ్ల నాటి హత్య కేసు చేధింపు!!

గంజాం జిల్లాలోని భంజనగర వద్ద ఐదేళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసును పోలీస్ లు ప్రస్తుతం ఛేదించారు. ఆ కేసులు నిందితులను అరెస్ట్ చేసారు. నిందితుల పేర్లు రోహిత్ (27), రింకు అలియాస్ భూపేష్ (27), సచిన్ అలియాస్ గౌరవ్ (28), దీపాంశు అలియాస్ మోంటు (26)లు సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో నివాసితుగా పోలీసులు పేర్కొన్నారు.

పోలీస్ లు తెలిపిన ప్రకారం రోహిత్ అనే వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి 2016, డిసెంబర్‌ 28న రాక్‌ గార్డెన్‌ నుంచి వస్తున్న సమయంలో ఉస్మాన్ ఖాన్‌ అనే వ్యక్తి రోహిత్ స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఉస్మాన్‌ను కత్తితో నరికి చంపారు. దీనికి సంబంధించి 2016, డిసెంబర్ 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో పటేల్ నగర్ పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్‌​ రాగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఖాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించారు.

పోలీసులు ఈ కేసులో అనుమానితులు వివరాలను సేకరించడానికి హ్యూమన్‌ ఇంటలీజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించి జూలై 27న కరోల్ బాగ్‌కు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి అతడి స్నేహితులు కలిసి ఖాన్‌తో గొడవ పడినట్లు గుర్తించారు. రోహిత్‌ని అరెస్టు చేసి విచారించడంతో నిజం ఒప్పుకుని మరో ముగ్గురు నిందితుల గురించి తెలుసుకుని వారిని కూడా అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    56
    Shares
  • 56
  •  
  •  
  •  
  •