జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

త్వరలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కు రెడీ అవ్వండి!!

కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి వర్క్ చేసేందుకు అనుమతించడంతో దాదాపు ఏడాదన్నర వరకు ఐటీ కారిడార్‌ ఉద్యోగులు లేక బోసిపోయింది. ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసులకు రాకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వర్క్ కల్చర్ దెబ్బతింటుందోనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతే కాకుండా వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఉత్పాదన తగ్గుతున్నదని కంపెనీలు భావిస్తున్నప్పటికీ చాలామందిలో వర్క్‌ ఫ్రం హోం నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు కూడా ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోతున్న క్రమంలో మూడో వేవ్‌ ముప్పుపై ఆందోళన నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రప్పించాలని ఐటీ కంపెనీల అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఐటీశాఖ అధికారులు కూడా ఇప్పటికే 300 కంపెనీలతో మాట్లాడి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుండగా కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం ఆఫీస్‌’ పాలసీని కూడా ప్రారంభించనున్నాయి. కనీసం 30 శాతం మంది ఉద్యోగులతో మొదలుపెట్టనున్నారు. ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో సిబ్బందిని రప్పించేందుకు ఐటీ వర్గాలు వెల్లడించాయి.

వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విధానాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఇన్ఫోసిస్‌ రెడీ అవుతుండగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో చాలామంది ఆఫీసులకు వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అన్ని కంపెనీల్లోని మెజారిటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (ICU) నిర్వహించిన సర్వే ప్రకారం 55 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం కారణంగా తక్కువ ఉత్పాదకత నమోదవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మేలో 10 వేల మంది ఐటీ ఉద్యోగులపై సర్వే నిర్వహించగా 20 శాతం ఉత్పాదకత తగ్గినట్లు వెల్లడైంది. వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ విధానాన్ని ప్రారంభించేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి.

కంపెనీ లు అన్ని ఉద్యోగులందరిని కరోనా టీకాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు టీసీఎస్‌ ఉద్యోగుల్లో 70 శాతం మంది టీకాలు వేయించుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగుల్లో 74 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది. విప్రో, టీసీఎస్‌ కంపెనీలు తమ ఉద్యోగులను సెప్టెంబర్‌లోగా ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీల ఆఫీసులను తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు 6,28,615 మంది ఉండగా అందులో పరోక్షంగా ఆధారపడ్డవారి సంఖ్య దాదాపు 18 లక్షలుగా ఉందని సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    12
    Shares
  • 12
  •  
  •  
  •  
  •