అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు పథకం అందించే దిశగా సింధు!!

గత ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన భారత షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరుకుంది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించడంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం అని క్రీడాభిమానులు ఆశలు రేకెత్తించింది.

తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన సింధు రెండో గేమ్‌లోనూ సత్తా చాటి తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. అయితే విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇవ్వగా ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గి సెమీస్‌కు చేరుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •