అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

లింక్డిన్‌ ఉద్యోగులు.. ఇకపై ఇంటి నుండి పని చేసే అవకాశం!!

మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమం లింక్డిన్‌ ఇకపై తమ ఉద్యోగులకు పూర్తిగా ‘ఇంటి నుంచి పని’ చేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తూ అవసరమైతే పార్ట్‌టైమ్‌ ఆఫీసుకి వచ్చే వెసులుబాటు కూడా కల్పించనుంది. ఈ కొత్త నిబంధన ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న 16000 మంది ఉద్యోగులకు వర్తిస్తుంది.

అయితే కొన్ని విధులు ఆఫీసుకు వస్తే గానీ పూర్తి చేయలేమని అలాంటి పనుల్లో ఉన్నవారు మాత్రం కచ్చితంగా కార్యాలయానికి రావాల్సిందేనని లింక్డిన్‌ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నివాస స్థలాన్ని మారిస్తే.. ఆ ప్రాంతానికి అనుగుణంగానే వేతనాలు ఉంటాయని తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •