అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మైక్రోసాఫ్ట్ యూజర్స్ లెమన్‌కాట్ తో జాగ్రత్త!

గత కొంత కాలంగా టెక్ సంస్థలకు జోకర్‌ మాల్‌వేర్ సవాల్‌ విసురుతుండడంతో దానికి చెక్‌ పెట్టె దిశగా టెక్ కంపెనీలు సరికొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తున్నప్పటికీ హ్యాకర్స్‌ కొత్త పద్ధతుల్లో సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా విండోస్‌, లైనెక్స్ యూజర్స్‌కి లెమన్‌డక్‌ అనే కొత్త మాల్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లు, ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తన యూజర్స్‌కి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ఈ లెమన్‌డక్‌ దాడి జరుగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. కొంత కాలంపాటు డివైజ్‌లలో స్తబ్దుగా ఉండి యూజర్స్ డివైజ్‌ల నుంచి డేటా సేకరించినట్లు గుర్తించామని, ఈ మాల్‌వేర్ ఇతర కంప్యూటర్లలోకి ప్రవేశించి ఇతర మాల్‌వేర్‌లను నాశనం చేస్తుందని పేర్కొన్నారు.

తాజాగా ఈ మాల్‌వేర్‌ సాయంతో సేకరించిన డేటాతో హ్యాకర్స్ క్రిప్టోకరెన్సీ రూపంలో బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు సమాచారం! యూజర్స్ క్రిప్టోకరెన్సీ లేదా ఇతర డిజిటల్‌ మనీకి సంబంధించి ఎలాంటి లింక్‌లను క్లిక్ చెయ్యొద్దని, లెమన్‌డెక్ మాల్‌వేర్ కంప్యూటర్లలోకి ప్రవేశించిన తర్వాత సెక్యూరిటీ కంట్రోల్స్‌ని తొలగించి యూజర్‌ ఆపరేషన్‌కి సంబంధించి కొన్ని టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసి ర్వాత యూజర్‌ డివైజ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు హ్యాకర్‌ కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ మాల్‌వేర్‌ బారినపడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ లేదా ఇతర యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడంతోపాటు, గుర్తుతెలియని, స్పష్టత లేని లింక్‌లను క్లిక్ చెయ్యొద్దని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •