వార్తలు (News)

అపార్ట్ మెంట్ పిల్లర్లకు జాకీలతో సపోర్ట్ చేసి నివసిస్తున్న ప్రజలు!!

వర్షాకాలం వచ్చిదంటే వర్షాలకు గోడలు..పునాదులు నానిపోయి ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంటాయి. ఇలాంటి భవనాలు అంటే దానిలో నివసించేవారితో పాటు చుట్టుపక్కల స్థానికులకు కూడా ప్రమాదంగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏపీ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ అటువంటి ప్రమాదంలోనే ఉంది. 17 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ అపార్ట మెంట్ ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్దంగా ఉంది. దీంతో దాంట్లో నివసిస్తున్న ప్రజలేకాకుండా స్థానికులు కూడా భయాందోళనలో ఉన్నారు.

ఆ అపార్ట్ మెంట్ ఎంత ప్రమాదంలో ఉంది అంటే సెల్లార్ లోని పిల్లర్లకు తీవ్రంగా పగుళ్ల ఏర్పడగా పిల్లర్లకు జాకీలతో సపోర్ట్ చేసి అలాగే నివసిస్తున్నారు ఆ అపార్ట్ మెంట్ వాసులు. 17 సంవత్సరాల క్రితం బిల్డర్ అల్లూరి సత్యనారాయణ నిర్మించిన ఈ అపార్ట్ మెంట్ ఇప్పుడు పెను ప్రమాదంలో ఉంది.ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలో పిల్లర్లకు పగుళ్లు పెద్దవి కావటంతో భయపడిని అపార్ట్ మెంట్ వాసులు ఒక్కొక్కరుగా ప్లాట్స్ ఖాళీ చేసి వెళ్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •