అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్.. ఎందుకంటే??

టోక్యో ఒలింపిక్స్ లో జర్మన్ అథ్లెట్ పేరు మార్టినా ట్రాజ్‌డోస్ జూడో విభాగంలో ఫైట్ కి రెడీ అవుతూ రింగ్ దగ్గరికి వెళుతుంటే వెనకాలు ఆమె కోచ్ రావడంతో ఆ వెంటనే ఆమె కోచ్ వైపుకి తిరిగింది. అతడు.. ముందుగా మార్టినా బాడీని బాగా షేక్ చేసి ఆ తర్వాత ఆమె రెండు చెంపలు చెళ్లుమనిపించాడు. ఆ తర్వాత మార్టినా రింగ్ లోకి వెళ్లింది. ఇది చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దీనిపై స్పందించిన మార్టినా కోచ్ తనను కావాలని కొట్టలేదని, తానే కావాలని తన కోచ్ తో అలా కొట్టించుకున్నానని వివరణ ఇస్తూ ప్రత్యర్థితో తలపడేందుకు రింగ్ లోకి వెళ్లేముందు అలా కొట్టించుకుంటే నేను మేల్కొని ఉంటానని, బాగా ఫైట్ చేయగలను అని ఆమె చెప్పింది. ఒకవేళ పోటీలో నేను ఓడిపోతే నన్ను నిందించకుండా ఉండేందుకు నా కోచ్ ని అలా చేయమని నేను చెబుతాను అంది. తనలో ఫైర్ నింపేందుకు తాను చెప్పినట్టే కోచ్ చేస్తున్నాడని ఆమె తెలిపింది. ప్రతి పోటీకి ముందు తాను పాటించే సంప్రదాయం అని వివరణ ఇచ్చింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    82
    Shares
  • 82
  •  
  •  
  •  
  •