జాతీయం (National) వార్తలు (News)

చివరికి నష్టాల్లోకి జారుకున్న నేటి మార్కెట్ సూచీలు!!

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం ఫ్లాట్ గ మొదలై క్రమంగా లాభాల్లోకి జారుకుని మధ్యాహ్నం తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. ఆ తర్వాత సూచీలు ఒక్కసారిగా కుప్పకూలడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెన్స్‌ 66 పాయింట్ల నష్టంతో 52,586 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ అయితే 15 పాయింట్లు నష్టపోయి 15,763 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా,ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •