ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఎముకలు బలంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి??

ప్రస్తుతం మనుషులు ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొందరి అనారోగ్యానికి ఆహారపు అలవాట్లు కారణమైతే మరి కొందరికి వ్యక్తిగత అలవాట్లు కారణమవుతున్నాయి. కాకపోతే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల ఇబ్బంది పడేవాళ్లు చాలామంది ఉన్నారు. వారు ఖనిజాలు, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి.

ఎముకలు బలంగా ఉంటే ఏ పని చేసిన అలసట ఉండదు. ఎముకలలో సత్తువ పోయినా కాల్షియం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి లభిస్తుండగా కాల్షియం ప్రధానంగా మనం తినే ఆహారంలో ఉంటే మంచిది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్ డి తో పాటు కాల్షియం శరీరంలో పెరిగే అవకాశం ఉంటుంది.

సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. పాలు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరిగే అవకాశం ఉంది. బ్రోకలీ, క్యాబేజీ, కాల్షియం, బచ్చలికూర తీసుకుంటే అందులో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం వల్ల శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. గుడ్డు లో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. గుడ్డులో ఉండే పచ్చసొన తింటే శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ లభిస్తాయి. విటమిన్‌ సి, విటమిన్‌ కె, విటమిన్‌ ఎ ఎముకల ఆరోగ్యంకు అతి ముఖ్యమైనవి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •