క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

రైతుల పై లాఠీ ఛార్జ్ కు ఆదేశించిన ఆఫీస‌ర్‌పై చ‌ర్య‌లు!!

హ‌ర్యానాలో బీజేపీ మీటింగ్‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వారంతా రక్తసిక్తమైన సంగతి తెలిసిందే! అయితే రైతుల ప‌ట్ల ఇంత అమానుషంగా ప్ర‌వ‌ర్తించాల‌ని చెప్పిన అధికారిపై ఇప్పుడు హ‌ర్యానా ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. క‌ర్నాల్ స‌బ్ డివిజన‌ల్ మెజిస్ట్రేల్ ఆయుష్ సిన్హా( Ayush Sinha ) పోలీసుల‌కు ఈ ఆదేశాలు ఇస్తున్న వీడియో ఒకటి బైటకి రావడంతో బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ స‌హా చాలా మంది తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో స‌ద‌రు అధికారిపై చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా ఆదివారం ప్ర‌క‌టించారు.

శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది రైతులు గాయ‌ప‌డ్డారు. హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఓం ప్ర‌కాశ్ ధ‌న్‌క‌ర్ పాల్గొన్న స‌భ‌కు నిర‌స‌న‌గా రైతులు ఆందోళ‌న చేపట్టడంతో ఆ రైతులు బ్యారికేడ్ల‌ను దాటి లోనికి రాకుండా చూడాల‌ని అధికారి ఆయుష్ సిన్హా పోలీసుల‌ను ఆదేశించారు. ఆ లైన్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దాటొద్దు. లాఠీ తీసుకొని గ‌ట్టిగా కొట్టండి. ఎలాంటి ఆదేశాలు అవ‌స‌రం లేదు. ఎవ‌రైనా నిర‌స‌న‌కారుడు నాకు ఇక్క‌డ క‌నిపిస్తే వాళ్ల త‌ల‌లు ప‌గిలి ఉండాలి అని ఆ వీడియోలో ఆయుష్ సిన్హా చెప్ప‌డం వినిపించడంతో అదిప్పుడు వివాదాస్పదమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •