రాజకీయం (Politics) వార్తలు (News)

పొగిడితే చర్యలు తప్పవు: స్టాలిన్??

ముఖ్యమంత్రి, ముఖ్యమైన రాజకీయ వేత్తలపై మామూలు ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణమైన విషయం! సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీలో సీఎం ఎదుట ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.

కానీ తమిళనాడు సీఎం మాత్రం శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చారు. శనివారం ఒక ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌, తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పొగడ్తలతో సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని సూచించారు.

సభా సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. సభలో అనవసర ప్రసంగాలు మాని, బడ్జెట్‌, రాష్ట్ర సమస్యలపై చర్చించాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీఎం స్టాలిన్‌ సభలో సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •