క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీలు మొదలు!!

తెలంగాణ లో మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీడీపీఓ డెబోరా సెప్టెంబర్‌ 1 నుంచి అంగన్‌వాడీ సెంటర్లు ప్రారంభమౌతాయని తెలిపారు. బాల్య వివాహాలను ముందస్తుగానే నిరోధించాలని, ఈ విషయాలపై అన్ని మతాల పెద్దలకు అవగాహన కల్పించామని చెప్పారు.

చైల్డ్‌ మ్యారేజ్‌ వల్ల కలిగే నష్టాల గురించి కిషోర బాలికలకు అవగాహన కల్పించాలని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏడబ్ల్యూసీ నిర్వహణ జరుగుతుందని వివరించారు. భ్రూణ హత్యలు, అబార్షన్‌ గురించి, ఇద్దరు ఆడ పిల్లలున్న మూడవ కాన్పు తల్లులకు ఆడపిల్లల్ని అమ్మకానికి ఉంచటం చట్టరీత్య నేరమని తెలుపటం జరిగిందన్నారు.

హెల్ప్‌ లైన్‌ నంబర్స్‌ 1098-చైల్డ్‌లైన్‌, 14567-సీనియర్‌ సిటిజన్‌ హెల్ప్‌ లైన్‌ ద్వారా ప్రజలు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో సూపర్వైజర్లు సుగుణ, కావ్య, చైల్డ్‌ లైన్‌ మెంబర్‌ వీరన్న, పాస్టర్‌, పూజారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •