ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పొద్దుతిరుగుడు గింజలతో షుగర్‌ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్! శరీరంలో షుగర్ లోని గ్లూకోజ్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడితే దానినే షుగర్ వ్యాధిబారిన పడతారు. ప్రస్తుతం జీవన విధానంలో శారీరక శ్రమ తక్కువ, తీసుకునే ఆహారం, జీవన శైలి ఇవన్నీ కూడా డయాబెటిస్ సమస్యకు కారణమవుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఒక్కరికైనా షుగర్ వ్యాధి ఉంది అని అంటే అతిశయోక్తి కాదు.

ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే శాశ్వత పరిష్కారం లేదు. అయితే షుగర్ వ్యాధి నివారణకు మన వంటింట్లో ఉండే ఔషధ పదార్ధాల తో నివారించవచ్చని మీకు తెలుసా?? వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది సహజ సిద్ధంగా దొరికే పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇప్పుడు పొద్దుతిరుగుడు గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒకసారి చూద్దాం!

సన్ ఫ్లవర్ ఆయిల్ మనలో ఎక్కువమంది వాడుతున్నారు. అయితే పొద్దుతిరుగు విత్తనాలు కూడా ఆహార పదార్థంగా ఉపయోగించవచ్చు. పైగా వీటి రుచి చాలా బాగుంటుంది. క్యాలరీలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంచే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పొద్దుతిరుగుడు గింజల్లో ఉన్నాయి.

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు బూడిదరంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ విత్తనాలులో మోనోసాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి . అంతేకాదు ఫైబర్ కంటెంట్ కూడా అధికం. అందుకనే వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి అనిపించదు. డయాబెటిస్ వారికి ఈ గింజలు మంచి ఉపయోగం. అందుకనే షుగర్ వ్యాధిగ్రస్థులు తమ డైట్ లో భాగంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది.

వీటిని నేరుగా కానీ, నీటిలో నానబెట్టుకుని గాని తినవచ్చు. ఎలా పొద్దుతిరుగుడు గింజలను తిన్నా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ఈ గింజలనుంచి వంట నూనె తయారు చేస్తారు. ఆహార పదార్ధాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే నిజానికి పొద్దుతిరుగుడు గింజలను నూనె కంటే నేరుగా తింటేనే చక్కటి ఆరోగ్యఫలితాలను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దామా??

పొద్దుతిరుగుడులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం.
వీటిల్లో ఉండే మాంగనీసు .. ఎముకలను ధృడంగా ఉంచడానికి సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు గింజలు కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుజేస్తాయి.
గింజల్లో ఉన్న విటమిన్ సి .. ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఈ విత్తనాలు పనిచేస్తాయి.
అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •