జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

“హైపర్” టెక్నాలజీ’ 90 నిముషాల్లో ఢిల్లీ టు ముంబై!!

కాలం మారుతూ నిరంతరం కొత్తదనాన్ని వేగాన్ని కోరుకుంటుండడంతో అంతర్జాతీయంగా రవాణా రంగంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన రవాణా ప్రస్తుతం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో అతిపెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో హైపర్‌లూప్‌లను నిర్మించే పనిలో పడ్డాయి. అందులో భాగంగా ప్రస్తుతం వర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. 2014 నుంచి ఈ పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు ట్రయల్ దశలోనే ఉన్నాయి. ఈ హైపర్‌లైన్ పూర్తయితే కచ్చితంగా రవాణా రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి.

నూతన సాంకేతికతను వినియోగిస్తూ వేగవంతమైన రవాణాను అందించడమే హైపర్‌లైన్ ప్రత్యేకత. ఇది హైస్పీడ్ రైల్ కంటే మూడు రెట్లు వేగవంతమైంది. సాధారణ రైలు కంటే పది రెట్లు వేగంగా గమ్యం చేరగలదు. హైపర్ లూప్ అనేది ఒక ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ, రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ, దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది సిద్ధాంతం.

హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీని వర్జిన్ వినియోగించనుంది. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. అంటే హైపర్ లూప్ గంటకు 1,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ సాంకేతికత వాణిజ్య జెట్లకు పోటీని ఇవ్వగలదు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్న ప్రయోగం హైపర్ లూప్ పోర్టల్‌లోని రూట్ అంచనా ఈ విధంగా ఉంది. ఢిల్లీ నుంచి ముంబైకి 1,153 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు హైపర్ లూప్ పోర్టల్ ప్రయాణిస్తే కేవలం గంటా 22 నిమిషాల్లో ఈ దూరాన్ని టెక్నాలజీ ఇంజనీర్‌లు చేరవచ్చంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •