అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అమెజాన్‌ లో కొత్త ఆఫర్‌.. కానీ ఆ అవకాశం కొద్దిమందికే!!

ఇ కామర్స్‌ సంస్థ అమెజాన్‌, స్టార్టప్‌​ కంపెనీ అఫిర్మ్‌ సంస్థలు సంయుక్తంగా కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చి పైలట్‌ ప్రాజెక్టుగా ప్రస్తుతం కేవలం అమెరికాలో కొద్ది మందికే ఆఫర్‌ను వర్తింపచేయాలనుకుంటున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఆఫర్ ను వర్తింపచేయాలని ప్రస్తుత ఆలోచన!

ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే పాలసీని ఇప్పుడు అన్ని కంపెనీలు అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడం మరియు యాపిల్‌ సంస్థ ఈ తరహా ఆఫర్‌ను అమల్లోకి తేగా తాజాగా అమెజాన్‌ సైతం అదే బాట పట్టింది. దీని కోసం అమెరికాకే చెందిన అఫిర్మ్‌ సంస్థతో జత కట్టింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంచుతున్నారు.

యూత్‌ , పార్ట్‌టైం జాబ్‌ చేసే వాళ్లు లక్ష్యంగా ఈ బయ్‌ నౌ పే లేటర్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం, ఆసక్తి ఉన్నా ఒకే సారి కొనేందుకు డబ్బులు చాలక క్రెడిక్‌ కార్డులు లేక ఇబ్బందులు పడే వారికి ఈ ఆఫర్‌లో ప్రాథాన్యత ఇవ్వనున్నారు. ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి పథకానికి సంబంధించి షాపింగ్‌ చేసేది అమెజాన్‌ సైట్‌లో అయినా సొమ్ము చెల్లింపు వ్యవహారం సజావుగా జరిగేలా చూసుకునే బాధ్యత అఫిర్మ్‌ స్టార్టప్‌దే. ఇప్పుడు బాధ్యతగా ఉండే యూత్‌కి ఈ ఆఫర్‌ అందివ్వడం ద్వారా బలమైన కస్టమర్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో ఆఫిర్మ్‌ సంస్థ ఈ కాన్సెప్టును అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుతం ఇ-కామర్స్‌ సైట్లలో రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నా అందులో నూటికి తొంభైశాతం ఆఫర్లు ప్రత్యేకంగా ఏ ప్రొడక్టుకు ఆ ప్రొడక్టు అన్నట్గుగానే ఉంటాయి. అయితే ఈ కొత్త ఆఫర్‌లో వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన మొత్తం బిల్లును తర్వాత చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. తర్వాత చెల్లింపులు పేరు చెప్పి అధిక వడ్డీలు, హిడ్డెన్‌ ఛార్జీలు ఏమీ విధించమని ఆ సంస్థ అంటోంది. ఈ ఆప్షన్‌ ద్వారా యాభై డాలర్ల వరకు విలువైన వివిధ వస్తువులను ఒకేసారి కొనుగోలు చేసి ఆ తర్వాత చెల్లింపులు చేయవచ్చు.

బయ్‌ నౌ పే లేటర్‌ ఆఫర్‌ను ప్రస్తుతం అమెరికాలోనే అందిస్తున్నారు. అది కూడా అమెజాన్‌ కస్టమర్‌ బేస్‌లో ట్రాక్‌ రికార్డు బాగున్న వారికే అందుబాటులోకి తెచ్చారు. అక్కడ వచ్చే ఫలితాలను బట్టే ఈ పథకం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దగ్గర మాత్రం క్రెడిక్‌ కార్డు ఈఎంఐలే అందుబాటులో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •